పవన్‌ జీవితంలో జగన్‌ను ఓడించలేరు: కొడాలి నాని

ABN , First Publish Date - 2021-10-03T20:14:30+05:30 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని మంత్రి కొడాలి నాని అన్నారు.

పవన్‌ జీవితంలో జగన్‌ను ఓడించలేరు: కొడాలి నాని

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఓ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పవన్‌ జీవితంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని అన్నారు. కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని కొందరు పెద్ద నిర్మాతలు.. విచ్చలవిడిగా బెనిఫిట్ షోలు వేసి ప్రజల డబ్బు దోచుకున్నారని విమర్శించారు. చిన్న సినిమాలు బతకాలనే ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రభుత్వం నిర్ణయంతో నలుగురికి ఇబ్బంది కలిగితే కలగవచ్చునని.. 96 శాతం మందికి ప్రయోజనం కలుగుతుందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-03T20:14:30+05:30 IST