కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-09-21T21:40:22+05:30 IST

మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడారని, డిక్లరేషన్ ఎవరూ పెట్టరని మాట్లాడతారా

కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం: సోము వీర్రాజు

విజయవాడ: మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడారని, డిక్లరేషన్ ఎవరూ పెట్టరని మాట్లాడతారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరగ్గొడితే.. బొమ్మ చెయ్యి అంటారా అని నిలదీశారు. రథం దగ్ధం అయితే రూ.కోటితో చేయిస్తున్నారన్నారు. వెంకన్నకు మనం ఎన్నో సేవలు చేస్తాం, వాటిని కూడా ప్రశ్నిస్తారా?.. ఎంతో కాలంగా వస్తున్న ఆచార వ్యవహరాలను మార్చేస్తారా? అని సోమువీర్రాజు ప్రశ్నించారు.

Updated Date - 2020-09-21T21:40:22+05:30 IST