మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మ దగ్దం

ABN , First Publish Date - 2020-09-23T21:10:56+05:30 IST

ఆలయాలపై జరుగుతున్న దాడులకు మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా..

మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మ దగ్దం

కృష్ణా జిల్లా: ఆలయాలపై జరుగుతున్న దాడులకు మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా కృష్ణా జిల్లా, నందిగామలో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నందిగామ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయం ఎదుట నిరసన చేపట్టారు. డౌన్ డౌన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2020-09-23T21:10:56+05:30 IST