చంద్రబాబును అరెస్ట్ చేసి లోపలేయాలి: మంత్రి కొడాలి

ABN , First Publish Date - 2022-01-25T03:28:42+05:30 IST

తన మంత్రి పదవి ఊడగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గుడివాడలో తన కన్వెన్షన్ సెంటర్‎లో ..

చంద్రబాబును అరెస్ట్ చేసి లోపలేయాలి: మంత్రి కొడాలి

తాడేపల్లి: తన మంత్రి పదవి ఊడగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గుడివాడలో తన కన్వెన్షన్ సెంటర్‎లో ఏదో  క్యాసినో జరిగి పోయిందని టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని  సవాల్ చేశాక..  టీడీపీ నేతలు క్రమంగా మాట మార్చుతూ వచ్చారని చెప్పారు. తొలుత కే కన్వన్షన్ సమీపంలో జరిగిందని, ఆ తర్వాత  గుడివాడలో జరిగిందని మాట మార్చారన్నారు. టీడీపీ నేతలు పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దని హెచ్చరిస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబును ప్రజలు రెండున్నర ఏళ్లక్రితం రాజకీయ సమాధి చేశారని వ్యాఖ్యానించారు. 


‘‘చంద్రబాబు ఇంటి గేటు టచ్ చేస్తే తనను చంపేస్తానని బుద్దా వెంకన్న మాట్లాడారు. చంద్రబాబు ఇంటి గేటు వద్ద బుద్దా వెంకన్నను కత్తి పెట్టుకుని కాపలా పెట్టారా?. చంద్రబాబు, లోకేష్‎ గురించి డీజీపీకి అంతా తెలుసు. బుద్దా వెంకన్న ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదు.  మంత్రిని మర్డర్ చేస్తా. డీజీపీకి వాటాలు ఉన్నాయని అంటే ఎవరైనా  ఊరుకుంటారా. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అనేక అసభ్యకర కార్యక్రమాలను ఆ పార్టీ నేతలే చేశారు. చంద్రబాబును అరెస్టు చేసి లోపలేయాలి.’’ అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-01-25T03:28:42+05:30 IST