కొడాలి నాని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే..:శ్రీనివాసానంద సరస్వతి

ABN , First Publish Date - 2020-09-24T19:56:31+05:30 IST

కొడాలి నాని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే..:శ్రీనివాసానంద సరస్వతి

కొడాలి నాని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే..:శ్రీనివాసానంద సరస్వతి

విశాఖ: జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ను హిందూగా మార్చానని కనీసం శారదాపీఠం అయినా చెప్పాల్సి ఉందన్నారు. హిందూ మతానికి అన్యాయం జరుగుతుంటే శారదాపీఠం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లే జగన్‌ తిరుమలకు తీసుకురావడానికి అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నించారు. కొడాలి నాని అచ్చోసిన ఆంబోతని శ్రీ శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. కొడాలి నాని మంత్రినా..రౌడీనా? అని ప్రశ్నించారు. కొడాలి నాని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే హిందువుల శక్తి ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. 

 

Updated Date - 2020-09-24T19:56:31+05:30 IST