Abn logo
Sep 23 2020 @ 15:41PM

బీజేపీ డిమాండ్‍పై స్పందించిన కొడాలి నాని

Kaakateeya

తిరుమల: బీజేపీపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తనను బర్తరఫ్ చేయాలన్న బీజేపీ డిమాండ్‍పై నాని స్పందించారు. పదిమందిని వెంటబెట్టుకుని కేంద్రమంత్రి అమిత్‍షాను తొలగించాలంటే తొలగిస్తారా? అని ప్రశ్నించారు. ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిదని ఉచిత సలహా ఇచ్చారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాటలు హాస్యాస్పదం ఉన్నాయని, అత్యధిక ఓట్లు వచ్చిన సీఎం జగన్‍కు సలహాలు ఇచ్చే స్థాయి బీజేపీకి ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు.. జగన్ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా అని నిలదీశారు. మోదీ తన భార్యను తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండని కొడాలి నాని చెప్పారు. 


‘‘బీజేపీ నేతలు ప్రధాని మోదీని బజారున పడేస్తున్నారు. ముందు ప్రధాని మోదీని సతీసమేతంగా ఆలయానికి రమ్మని చెప్పండి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు టీటీడీనే సీఎంను ఆహ్వానిస్తే డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలి? స్వామివారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారు. సీఎం జగన్‌కీ కులాలు.. మతాలతో సంబంధం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారిని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. సోమువీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాతే... ఆలయాలపై దాడులు పెరిగాయి’’ అని కొడాలి నాని ఆరోపించారు.

Advertisement
Advertisement
Advertisement