Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఢిల్లీ వెళ్లి తేల్చుకొస్తానన్న కేసీఆర్ ఏం చేశారు?: కోదండరాం

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రైతుకు పట్టిన పెద్ద చీడగా మారారన్నారు. ఢిల్లీ వెళ్లి తేల్చుకొస్తానన్న సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఢిల్లీలో ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి భరతం పట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులు ఏ పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. కేసీఆర్ రైతు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రైతుల కోసం ఎంతవరకైనా పోరాడుతామని కోదండరాం స్పష్టం చేశారు.

Advertisement
Advertisement