ఉచిత కరోనా పరీక్షలు, వైద్యం అందజేయాలి: కోదండరాం

ABN , First Publish Date - 2020-08-14T20:14:54+05:30 IST

హైదరాబాద్: టీజేఎస్ కార్యాలయంలో అఖిలపక్షం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ..

ఉచిత కరోనా పరీక్షలు, వైద్యం అందజేయాలి: కోదండరాం

హైదరాబాద్: టీజేఎస్ కార్యాలయంలో అఖిలపక్షం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కరోనా పరీక్షలు, వైద్యం అందజేయాలని కోదండరాం కోరారు. ఆరు నెలలపాటు ప్రతి కుటుంబానికి 7,500 నగదు, ఉచిత రేషన్ ఇవ్వాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ ఉపాధి హామీ పథకం ప్రవేశం పెట్టాలన్నారు. తొలగించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. అఖిలపక్షం ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. హైకోర్టు సైతం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా సిగ్గురావటం లేదన్నారు. అఖిలపక్షం ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. డిమాండ్ల పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేస్తామని కోదండరాం పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-14T20:14:54+05:30 IST