Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోడెల విగ్రహావిష్కరణ వివాదం

నరసరావుపేట: శాసనసభ మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు విగ్రహావిష్కరణ వివాదం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరింది. ఆయన కుమారుడు డాక్టర్‌ శివరాం తమ స్వగ్రామం కండ్లకుంటలో గురువారం విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టారు. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఆహ్వానించారు. కానీ ఈ కార్యక్రమానికి రావొద్దని కొందరు స్థానిక నేతలు అచ్చెన్నాయుడును కలసి కోరారు. తమకు అంతర్గతంగా శివరాంతో ఉన్న సమస్యలను వారు చెప్పారు. దీంతో హాజరు కారాదని అచ్చెన్నాయుడు నిర్ణయించుకొన్నారు. ముందు అక్కడున్న వివాదాన్ని పరిష్కరించడంపై దృష్టి పెడతానని, తప్పనిసరిగా దానిని పరిష్కరిస్తామని ఆయన విలేకరులకు చెప్పారు. ఈ వివాదంపై ఆ గ్రామంలోని పెద్దలు జోక్యం చేసుకొని దానిని చల్లబర్చారు. కోడెల విగ్రహావిష్కరణ సమయంలో ఇటువంటి సమస్యలు ముందుకు తేవడం సరికాదని, గ్రామ స్థాయిలోనైనా ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవాలని పెద్దలు చేసిన సూచనకు అందరూ అంగీకరించినట్లు చెబుతున్నారు. 

Advertisement
Advertisement