Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజల మనసుల్లో కోడెల జ్ఞాపకాలు చెరిపివేయలేరు: టీడీపీ

చిలకలూరిపేట: నవ్యాంధ్రప్రదేశ్‌ తొలిశాసనసభాపతిగా కోడెల నిర్వహించిన పాత్ర ఆదర్శనీయమని, ప్రజల మనసులలో కోడెల జ్ఞాపకాలు చెరిపివేయలేరని పలువురు చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ తొలిశాసనసభాపతి, మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ద్వితీయ వర్థంతి వేడుకలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్‌బాబు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధానకార్యదర్శి జరీనాసుల్తానా, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ నజీరున్నిసాబేగం, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి పఠాన్‌ సమద్‌ఖాన్‌, ఎస్సీసెల్‌ జిల్లా మాజీకార్యదర్శి జరుగుమల్లి చెన్నయ్యలు మాట్లాడుతూ 36 ఏళ్లపాటు తెలుగుదేశంపార్టీతో ఉండి ప్రజల కష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాదరావు అనన్నారు. రాష్ట్ర రాజకీయాలకు కోడెల లేని లోటు తీరనిదన్నారు. కోడెల ప్రజాసేవ గురించి కోటప్పకొండ ఆలయం చెబుతుందన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించిన కోడెల ఆదర్శనీయుడని కొనియాడారు.


సామూహిక అవయవదాన కార్యక్రమం నిర్వహించిన ఘనత కోడెలకు దక్కుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు జంగా వినాయకరావు ఆధ్వర్యంలో స్వీట్లు, పులిహోర పంపిణీ చేశారు. పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్‌ సమద్‌ఖాన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలోని పార్టీ నాయకులు షేక్‌ అబ్దుల్‌కుమీర్‌, అమరా రమాదేవి, గుర్రం నాగపూర్ణచంద్రరావు, అంబటి సోంబాబు, గంగా శ్రీనివాసరావు, అజారుద్దీన్‌, పోపూరి లక్ష్మి,మద్దుమాల రవి, షేక్‌ బాజి, ఏలూరి తిరుపతయ్య, కంచర్ల శ్రీనివాసరావు, మురకొండ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement