దారులన్నీ ఆంధ్రా వైపు

ABN , First Publish Date - 2022-01-15T05:55:05+05:30 IST

దారులన్నీ ఆంధ్రా వైపే. యువత పయనం మొత్తం అటే. సంక్రాంతి కావడంతో ఆంధ్రా ప్రాంతంలో కోడి పందాలు జోరందకున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో తెలంగాణలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలు.. ముఖ్యంగా కృష్ణా జిల్లా మొరసుమిల్లి, గంగినేని, గూడెంమాదారం, పెనుగలలో విస్తృతంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు.

దారులన్నీ ఆంధ్రా వైపు
పందానికి కోళ్లను సిద్ధం చేస్తున్న నిర్వాహకులు

కోడిపందేలకు సరిహద్దు గ్రామాలకు తరలిన యువత

పందాలకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం

సరిహద్దుల్లో నిలువరించని తెలంగాణ పోలీసులు

రూ.లక్షల్లో చేతులు మారుతున్న నగదు

ఎర్రుపాలెం, జనవరి14: దారులన్నీ ఆంధ్రా వైపే. యువత పయనం మొత్తం అటే. సంక్రాంతి కావడంతో ఆంధ్రా ప్రాంతంలో కోడి పందాలు జోరందకున్నాయి. అక్కడి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో తెలంగాణలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలు.. ముఖ్యంగా కృష్ణా జిల్లా మొరసుమిల్లి, గంగినేని, గూడెంమాదారం, పెనుగలలో విస్తృతంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ఇక్కడి నుంచి యువతను పందేలు నిర్వహించే ప్రాంతాలకు వెళ్లనియకుండా పోలీసులు నిలువరిస్తారు. కానీ ఈ సారి అలాంటి దాఖలాలు కన్పించడం లేదు. కోడిపందాలే కాకుండా పేకాట, బొమ్మాబొరుసును అక్కడ నిర్వహిస్తుండటంతో జూదరులు అక్కడి బాట పడుతున్నారు. కోడి పందాల శిబిరంలో భోజనం, మద్యం వంటి సదుపాయాలను నిర్వాహకులు కల్పిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి నగరాల్లో స్థిరపడిన మండల యువత పండగ పూట కాలక్షేపం కోసం పందాల నిర్వహించే ప్రదేశాలకు వెళ్తున్నారు. రూ. లక్షల్లో సాగే పందాల్లో చాలా మంది నగదు పోగొట్టుకున్నారని పేరు రాసేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి ఆంధ్రజ్యోతితో వాపోయాడు. మద్యం ధరల అమాంతం పెంచి అమ్ముతున్నారని వివరించాడు.


Updated Date - 2022-01-15T05:55:05+05:30 IST