Abn logo
Mar 2 2021 @ 00:05AM

కోడి పందేలపై దాడి : రూ. 8.43 లక్షలు స్వాధీనం

ఆరు కార్లు, 12 బైక్‌లు స్వాధీనం 

భీమడోలు, మార్చి 1  : గుండుగొలను శివారు రత్నాపురం సమీపంలోని పొలాల్లో భీమడోలు పోలీసులు కోడి పందేలపై సోమవారం దాడులు నిర్వహించారు. భీమడోలు ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపిన వివరాలు.. గుండుగొలనులో కొంతమంది వ్యక్తులు, ఖమ్మం జిల్లా నుంచి, లింగపాలెం మం డలంలో కొంతమంది కోడిపందేలు నిర్వహిస్తుం డగా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో 16 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకుని ఆరు కార్లు, 12 మోటారు సైకిళ్ళు, 22 కోడి కత్తులతో పాటు 8 లక్షల 43 వేల సొమ్మును స్వాధీన పర్చుకుని కోర్టుకు తరలించామన్నారు. వీరందరిని కోర్టుకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement