Advertisement
Advertisement
Abn logo
Advertisement

హోరాహోరీగా కోడిపోరు

వీరారాధన ఉత్సవాల్లో ముగిసిన ప్రధాన ఘట్టం

కారంపూడి, డిసెంబరు 6: పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో అతి ముఖ్యమైన ప్రధాన ఘట్టం కోడిపోరు. సోమవారం వీర్ల దేవాలయం వద్ద కోడిపోరు చూసేందుకు ప్రజలు అధికంగా తరలివచ్చారు. బ్రహ్మనాయుడు కోడి చిట్టిమల్లును ప్రభుత్వవిప్‌, మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాయకురాలు నాగమ్మ కోడి శివంగి డేగను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేతపట్టారు. రెండుకోళ్లను ఇద్దరు నేతలు ప్రజల సమక్షంలో పోరుకు దింపగా, పిఠాధిపతి తరుణ్‌చెన్నకేశవ అయ్యవారు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోడిపందాలకు పెద్దలుగా వ్యవహరించారు. హోరాహోరీ పోరులో చివరకు నాగమ్మ కోడి గెలిచిందని ప్రకటించారు. అదే దాయాదుల పోరుకు ప్రధానమైంది. అదే రీతిలో నాటకీయంగా వీరవిద్యావంతులు గానం చేసి కోడిపోరు ఘట్టం నిర్వహించారు.   కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, మాచర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తురకా కిషోర్‌, వైసీపీ మండల కన్వీనర్‌ కొంగర సుబ్రహ్మణ్యం, ఎంపీపీ మేకల శారదాశ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ షఫి, సొసైటీ చైర్మన్‌ నల్ల గురవారెడ్డి, సర్పంచ్‌ ప్రమీలా తేజానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. పీఠం నిర్వాహకుడు బొగ్గరం విజయ్‌కుమార్‌ ప్రజాప్రతినిధులను దుశ్శాలువలతో సన్మానించారు. గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్‌ ఆధ్వర్యాన సీఐ ఉమేష్‌, ఎస్‌ఐ బాలకృష్ణలు బందోబస్తు ఏర్పాటుచేశారు.


ప్రథమ బహుమతి సాధించిన ఎడ్లజతతో ఎమ్మెల్యే పీఆర్కే, ఎమ్మెల్సీ జంగా

వేటపాలెం ఎడ్లజతకు ప్రథమస్థానం

పల్నాటి వీరారాధన ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు ఎడ్లపోటీల్లో చుండూరు మండలం వేటపాలేనికి చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణచౌదరి ఎడ్లజత సేద్యపు విభాగంలో ప్రథమ బహుమతి పొందింది. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని పులగం త్రిశజ్ఞరెడ్డికి చెందిన ఎడ్లజత ద్వితీయ బహుమతి పొందింది. పెదకాకాని మండలం కొప్పురావూరుకు చెందిన సిరివారి శ్రీనివాసరావు ఎడ్లజత తృతీయం, బెల్లంకొండ మండలం నందిరాజుపాలేనికి చెందిన బి.సుబ్బారెడ్డి ఎడ్లజత నాలుగోస్థానం, దాచేపల్లి మండలం ముత్యాలంపాడుకు చెందిన కొప్పుల వెంకటరెడ్డి ఎడ్లజత ఐదోస్థానం, ప్రకాశం జిల్లా సింగరాయకొండ సోమరాజుపల్లెకు చెందిన పి.శ్రీనివాసరావు ఎడ్లజత ఆరోస్థానంలో నిలిచింది. వీరందరికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, మాచర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తురకా కిషోర్‌లు నగదు, షీల్డ్‌ బహుమతులు అందించారు. కార్యక్రమంలో నిర్వాహకుడు బొమ్మిన అల్లయ్య, కొంగర సుబ్రహ్మణ్యం, సర్పంచ్‌ ప్రమీలా తేజానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement