Abn logo
Aug 24 2021 @ 16:37PM

కోర్టుకి కోగంటి సత్యం

విజయవాడ: జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారి రాహుల్ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న కోగంటి సత్యంను విజయవాడ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద పోలీసుల హైడ్రామా జరిగింది. మీడియా కంట పడకుండా సత్యంను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. 

 

 ఈ నెల 18న రాత్రి కారులో డీవీమానర్ రోడ్డులో రాహుల్  హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఏ-2 నిందితుడైన కోగంటి సత్యంను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని బెంగళూరు దేవనహల్లి కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొస్తుచ్చారు.