Abn logo
Jun 1 2021 @ 20:32PM

Virat Kohli: నెటిజన్ల విమర్శలకు కౌంటర్!

తన ఆహార అలవాట్ల గురించి సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న నెటిజన్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. గతేడాది లాక్‌డౌన్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఇన్‌స్టా వేదికగా ముచ్చటించిన కోహ్లీ.. అనారోగ్య సమస్యల కారణంగా శాకాహారిగా మారినట్టు చెప్పాడు. తాజాగా అభిమానులతో ఇన్‌స్టా ద్వారా ఛాట్ చేసిన కోహ్లీని ఓ అభిమాని `మీరు తీసుకునే డైట్ ఏంటి?` అని ప్రశ్నించాడు. 


దానికి స్పందించిన కోహ్లీ.. `కూరగాయలు, గుడ్లు, రెండు కప్పుల కాఫీ, పప్పు, పాలకూర, దోశలు తింటాన`ని చెప్పాడు. దీంతో కోహ్లీపై నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో వీగన్‌గా మారానని చెప్పి ఇప్పుడు గుడ్లు ఎలా తింటున్నావని ప్రశ్నించారు. కోహ్లీ మాట తప్పాడని విమర్శించారు. దీంతో కోహ్లీ స్పందిస్తూ.. `నేను వీగన్ అని ఎప్పుడూ చెప్పలేదు. వెజిటేరియన్ అని మాత్రమే చెప్పాను. ఇక, ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని మీ కూరగాయలు తినండి (తినాలనుకుంటే..)` అని ట్వీట్ చేశాడు. 


క్రైమ్ మరిన్ని...