ధావన్ ఇలాగే చేస్తాడు.. కోహ్లీ ఫన్నీ వీడియో

ABN , First Publish Date - 2021-10-18T21:50:48+05:30 IST

ఒకే ఆట ఆడే ఆటగాళ్లైనా సరే.. ఆట ఆడే తీరులో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉంటుంది. శరీర కదలికలు, ముఖకవలికలు ఒక్కొక్కరివి ఒక్కో రకంగా ఉంటాయి. టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కూడా ఒక ప్రత్యేకమైన శైలి ఉంది...

ధావన్ ఇలాగే చేస్తాడు.. కోహ్లీ ఫన్నీ వీడియో

న్యూఢిల్లీ: ఒకే ఆట ఆడే ఆటగాళ్లైనా సరే.. ఆట ఆడే తీరులో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉంటుంది. శరీర కదలికలు, ముఖకవలికలు ఒక్కొక్కరివి ఒక్కో రకంగా ఉంటాయి. టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కూడా ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అయితే ఆ ప్రత్యేకతను వివరిస్తూ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫన్నీగా స్పందించారు. ధావన్ బ్యాటింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ కోహ్లీ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ధావన్ బ్యాటింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వీడియో షేర్ చేసిన కోహ్లీ.. శిఖర్ ధావన్ బ్యాటింగ్ స్టైల్‌ను తాను పలుమార్లు గమనించానని, చాలా సరదాగా ఉంటుందని, అందుకే ఈ వీడియో చేశానని కోహ్లీ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ‘శిఖి, ఇది ఎలా ఉంది?’ అంటూ శిఖర్ ధావన్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.



Updated Date - 2021-10-18T21:50:48+05:30 IST