హైదరాబాద్‌ టీసీఎస్‌ ఉద్యోగులు 50 వేలు

ABN , First Publish Date - 2020-11-28T06:43:05+05:30 IST

హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఉద్యోగులు 13 ఏళ్లలో పదింతలకు పైగా పెరిగారు. 2007లో 4,500 మంది ఉంటే.. ఇప్పుడు 50,000 మందికి చేరారు. గత నెలలోనే హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 50,000 మందికి చేరిందని టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ, ఏపీ ప్రాంతీయ అధిపతి వీ రాజన్న తెలిపారు. 2014లో 25,000 మంది పని చేస్తుంటే.. ఆరేళ్లలో రెట్టింపు అయ్యారన్నారు

హైదరాబాద్‌ టీసీఎస్‌ ఉద్యోగులు 50 వేలు

కోహ్లీకి హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఉద్యోగులు 13 ఏళ్లలో పదింతలకు పైగా పెరిగారు. 2007లో 4,500 మంది ఉంటే.. ఇప్పుడు 50,000 మందికి చేరారు. గత నెలలోనే హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఉద్యోగుల సంఖ్య 50,000 మందికి చేరిందని టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ, ఏపీ ప్రాంతీయ అధిపతి వీ రాజన్న తెలిపారు. 2014లో 25,000 మంది పని చేస్తుంటే.. ఆరేళ్లలో రెట్టింపు అయ్యారన్నారు. గురువారం కన్నుమూసిన టీసీఎస్‌ వ్యవస్థాకుడు, కంపెనీ తొలి సీఈఓ ఫకీర్‌ చంద్‌ కోహ్లీకి హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఏడో దశకంలో టీసీఎ్‌సను ఆయన హైదరాబాద్‌లోనే ప్రారంభించారు. ఐటీ పరిశ్రమ పితామహుడిగా పిలిచే కోహ్లీ ఆడల్ట్‌ లిటరసీ ప్రోగ్రామ్‌ను రూపొందించి ముందుగా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేశారు. ఈ కార్యక్రమం కింద 4-6 వారాల్లో ఒక వ్యక్తి ఒక భాషను మాట్లాడం నేర్చుకోవచ్చని చెప్పారు. 


కోహ్లీ పేరుతో ట్రిపుల్‌ఐటీ, హైదరాబాద్‌లో టీసీఎస్‌ కృత్రిమ మేధ (ఏఐ) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ‘కోహ్లీ సెంటర్‌ ఆన్‌ ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌’ దేశంలోనే కీలకమైన ఏఐ కేంద్రాల్లో ఒకటని చెప్పారు. అలానే కోహ్లీ హైదరాబాద్‌లో సైబర్‌నేటిక్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రాజన్న తెలిపారు. 2016లో హైసియా కోహ్లీకి జీవిత కాల సాఫల్య అవార్డును ఇచ్చిందని వివరించారు. 

Updated Date - 2020-11-28T06:43:05+05:30 IST