రెండు నెలల తర్వాత కళకళలాడిన కోల్‌కతా విమానాశ్రయం

ABN , First Publish Date - 2020-05-28T15:31:10+05:30 IST

కరోనా లాక్‌డౌన్, ఆంఫన్ తుపాన్ నేపథ్యంలో రెండునెలల విరామం అనంతరం కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాల రాకపోకలు గురువారం పునర్ ప్రారంభమయ్యాయి....

రెండు నెలల తర్వాత కళకళలాడిన కోల్‌కతా విమానాశ్రయం

విమాన సర్వీసుల పునరుద్ధరణ

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): కరోనా లాక్‌డౌన్, ఆంఫన్ తుపాన్ నేపథ్యంలో రెండునెలల విరామం అనంతరం  కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాల రాకపోకలు గురువారం పునర్ ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ నగరాల నుంచి 10 విమానాలు కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చాయి. మరో పది విమానాలు వివిధ నగరాలకు టేకాఫ్ అయ్యాయి. దీంతో గురువారం కోల్‌కతా  విమానాశ్రయం ప్రయాణికులతో కళకళలాడింది. ఢిల్లీ నుంచి కోల్‌కతా  విమానాశ్రయానికి 122 మంది ప్రయాణికులు తిరిగివచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 40 మంది గువహటికి పయనమయ్యారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విమానాశ్రయాన్ని శానిటైజ్ చేయడంతోపాటు ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా విమానాశ్రయ అధికారులు చర్యలు తీసుకున్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బాగ్ డోగ్రా విమానాశ్రయానికి విమానాలు రాకపోకలు సాగించాయి. ప్రయాణికులను తనిఖీ చేయడంతోపాటు కరోనా లక్షణాలున్న వారిని హోం క్వారంటైన్ కు తరలించారు.

Updated Date - 2020-05-28T15:31:10+05:30 IST