యోగి అభివృద్ధిలో కోల్‌కతా ఫ్లైఓవర్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు

ABN , First Publish Date - 2021-09-12T21:44:47+05:30 IST

ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలైలే యోగీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘బెంగాల్‌లోని అభివృద్ధిని దొంగిలిండమే యోగి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్..

యోగి అభివృద్ధిలో కోల్‌కతా ఫ్లైఓవర్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు

న్యూఢిల్లీ: ‘యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది’ అంటూ ఓ వార్తా పత్రికలో వచ్చిన ప్రకటన నెట్టింటిని కుదిపివేస్తోంది. ఈ ప్రకటనలో యోగి ఆదిత్యనాథ్ నిలువెత్తు చిత్రంపై ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినప్పటికీ, కింది భాగంలో ఉన్న వంతెన, భవనాల చిత్రాలు బీజేపీని చిక్కుల్లో పడేశాయి. ఎందుకంటే యోగి ప్రభుత్వం నిర్మించినట్లు చెప్పుకుంటున్న ఆ వంతెన, భవనం ఉత్తరప్రదేశ్‌లో లేవు. వాస్తవానికి అవి కోల్‌కతాకు చెందినవి. ఇది నెట్టింట వైరల్ కావడంతో ‘దొంగిలించిన అభివృద్ధి’ అభివృద్ధి అంటూ నెటిజెన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.


కేంబ్రిడ్జీ, వైట్ హౌస్, బీజింగ్ ఎయిర్‌పోర్ట్, బూర్జ్ ఖలీఫా లాంటి ప్రపంచంలోని ప్రఖ్యాత నిర్మాణాల ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఇవన్నీ యోగి ఆదిత్యనాథ్ నిర్మించనవేనంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ‘దొంగిలించిన అభివృద్ధి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ఇండియా ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ యోగిపై నెటిజెన్లు పెద్ద ఎత్తు జోకులు వేస్తున్నారు.


ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలైలే యోగీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘బెంగాల్‌లోని అభివృద్ధిని దొంగిలిండమే యోగి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ అభివృద్ధి. బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్ పూర్తిగా దెబ్బతిన్నది. బీజేపీకి బలమైన పట్టున్న రాష్ట్రం కేవలం ప్రచారానికి మాత్రమే మిగిలిపోయింది’’ అని రాసుకొచ్చారు.



















Updated Date - 2021-09-12T21:44:47+05:30 IST