ఐపీఎల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్

ABN , First Publish Date - 2020-10-22T00:44:07+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో...

ఐపీఎల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో కోల్‌కత్తా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ టీంలో మావి, రస్సెల్ బదులు టామ్ బంటన్, ప్రశీద్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌కు బెంగళూరు జట్టులో షాబాజ్ అహ్మద్ దూరం కాగా, సిరాజ్ ఆడనున్నాడు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ, నాలుగో స్థానంలో ఉన్న కేకేఆర్ జట్లు తలపడుతుండటంతో ఇరు జట్ల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కోహ్లీ సేన 9 మ్యాచ్‌లు ఆడి ఆరు గెలవగా, మోర్గాన్ కెప్టెన్సీలో ముందుకెళుతున్న కేకేఆర్ జట్టు 9 మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవ్‌దత్ పడిక్కల్, ఫించ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్),  గురుకీరత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, మహ్మద్ సిరాజ్, ఉదన, నవదీప్ సైనీ, చాహల్


కోల్‌కత్తా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ గిల్, టామ్ బంటన్, నితీష్ రాణా, మోర్గాన్(కెప్టెన్), దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, పాట్ కమ్మిన్స్, ఫెర్గ్యూసన్, కుల్దీప్ యాదవ్, ప్రశీద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

Updated Date - 2020-10-22T00:44:07+05:30 IST