Abn logo
Sep 19 2021 @ 13:31PM

కమీషన్ల కోసం బందరు పోర్టును బలి చేస్తున్నారు: కొల్లు రవీంద్ర

అమరావతి: వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కమీషన్ల కోసం బందరు పోర్టును బలి చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భూసమీకరణ చేస్తే రైతులకు అన్యాయం జరిగిపోతుందని వైసీపీ నేతలు నానాయాగీ చేశారని, ఇప్పుడు పోర్టు భూములను తాకట్టు పెట్టి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల కమీషన్లకు భయపడి టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. పోర్టు పేరుతో బందరు ప్రజల ఆశలతో ఆడుకోవాలని చూస్తే సహించేది లేదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.