కొలువుదీరనున్న గణనాథుడు

ABN , First Publish Date - 2022-08-31T06:07:31+05:30 IST

భక్తులు అధిక సంఖ్యలో కొలిచే వినాయక చవితి పండుగను బుధవారం ఘనంగా జరుపుకోనున్నారు. శ్రావణ మాసం అనంతరం వచ్చే అతిపెద్ద పండుగలలో వినాయక చవితి ఒక్కటి. ఈ పండుగ ఊరూవాడ, పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతీఒక్కరు జరుపు కుంటారు. ముఖ్యంగా ఎన్నో పేర్లతో పిలుచుకునే వినాయకున్ని ప్రతిష్ఠించే నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.

కొలువుదీరనున్న గణనాథుడు
మట్టి గణనాథులను కొనుగోలు చేస్తున్న ప్రజలు

జిల్లాలో ముస్తాభైన మండపాలు

 నేడే వినాయక చవితి

ఆదిలాబాద్‌ టౌన్‌, ఆగస్టు 30: భక్తులు అధిక సంఖ్యలో కొలిచే వినాయక చవితి పండుగను బుధవారం ఘనంగా జరుపుకోనున్నారు. శ్రావణ మాసం అనంతరం వచ్చే అతిపెద్ద పండుగలలో వినాయక చవితి ఒక్కటి. ఈ పండుగ ఊరూవాడ, పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతీఒక్కరు జరుపు కుంటారు. ముఖ్యంగా ఎన్నో పేర్లతో పిలుచుకునే వినాయకున్ని ప్రతిష్ఠించే నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ వినాయక చవితి పర్వదినా న్ని పురస్కరించుకుని గణనాథుడు మండపాల్లో కొలువు దీరనున్నాడు. అయితే భక్తులు వినాయకున్ని ప్రతిష్ఠించేందుకు మార్కెట్‌లో విఘ్నేశ్వరుని ప్రతిమలను కొనుగోలు చేసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో పట్ట ణంలో ఎటుచూసినా వినాయక విగ్రహాలు, భక్తులు పూజాసామగ్రి కొనుగో లుతో సందడిగా మారింది. ఇప్పటికే యువత, భక్తులు పెద్దఎత్తున ప్రత్యేక హంగులు, విద్యుత్‌ కాంతులతో మండపాలను సిద్ధం చేశారు.

డీజేలకు అనుమతులు లేవు : సీఐ 

బేల, ఆగస్టు 30: నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ కోల నరేష్‌ అన్నారు. మంగళవారం బేల పోలీసు స్టేషన్‌లో ఎస్సై కృష్ణకుమార్‌ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ గణేష్‌ నిమజ్జనం తేదీ ముందుగానే తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్‌ మండలి నిర్వాహకులు, రాజకీయ నాయకులు, మత గురువు వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గణేష్‌ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవడానకి సహకరిస్తామని తెలిపారు.

శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్సై

నేరడిగొండ: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహిం చుకోవాలని ఎస్సై మహేందర్‌ అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మం గళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అన్ని మతాల ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. సభ్యులు అనుమతి కోసం ముందుగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఉత్స వాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ కోసం రూ.1,560 చెల్లించాలి

ఇచ్చోడ: గణేష్‌ మండపాల వారు తప్పనిసరిగా విద్యుత్‌ను వినియోగిం చే వారు తప్పనిసరిగా రూ.1560 చెల్లించాలని అసిస్టెంట్‌ డివిజన్‌ ఇంజినీర్‌ సుబ్రమణ్యం అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో స్థానిక విద్యుత్‌ డివిజన్‌ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. బోథ్‌, ఇచ్చోడ, నేరడిగొండ, బజార్‌హత్నుర్‌ మండలాల వినయాక ఉత్సవ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని గమనించి తప్పని సరిగా విద్యుత్‌ శాఖకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-08-31T06:07:31+05:30 IST