సర్వేలో కేసీఆర్ 16వ స్థానానికి దిగజారారు: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2020-06-05T20:15:52+05:30 IST

యాదాద్రి: తెలంగాణ రాష్ట్రం అన్నిట్లో ముందుoదని గొప్పలు చెప్పే సీఎం కేసీఆర్ ఓ సర్వేలో పదహారువ స్థానంలోకి ఎలా దిగజారారని..

సర్వేలో కేసీఆర్ 16వ స్థానానికి దిగజారారు: కోమటిరెడ్డి

యాదాద్రి: తెలంగాణ రాష్ట్రం అన్నిట్లో ముందుoదని గొప్పలు చెప్పే సీఎం కేసీఆర్ ఓ సర్వేలో పదహారువ స్థానంలోకి ఎలా దిగజారారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. గందమల్ల రిజర్వాయర్ నిర్మాణము లేదని అధికారులే చెబుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో గందమల్ల రిజర్వాయర్ ఉందని ప్రజలను మోసం చేసిన ఆలేరు ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


అలనాటి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రాజెక్టులకు కొద్దిపాటి నిధులు ఇస్తే పూర్తవుతాయన్నారు.. కానీ వాటిని పూర్తి చేయకుండా కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడానికి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ.. కాంగ్రెస్ నాయకులపై నిందలు వేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. కరోనా టెస్టుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా పరీక్షలు చేయటం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మేలు కంటే కీడు ఎక్కువగా చేస్తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.

Updated Date - 2020-06-05T20:15:52+05:30 IST