జీహెచ్ఎంసీ ఫలితాలు చూసి నిరుత్సాహపడొద్దు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-04T19:59:30+05:30 IST

జీహెచ్ఎంసీ ఫలితాలు చూసి కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ ఫలితాలు చూసి నిరుత్సాహపడొద్దు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ : జీహెచ్ఎంసీ ఫలితాలు చూసి కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీ అధికార దుర్వినియోగం, కులమతాలకు కొట్లాట పెట్టి లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు గెలుపు, ఓటములు సహజమేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి చెందిందని చెప్పారు.  పీసీసీ మార్పును కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు.  దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు తాత్కాలికమైనవేనని చెప్పడం గమనార్హం. మరో రెండేళ్ల తర్వాత కాంగ్రెస్‌దే పాలన అని వ్యాఖ్యానించారు. 


ఢిల్లీలో రైతుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నానని అన్నారు. తెలంగాణలోనూ ఢిల్లీ మాదిరిగా ఉద్యమం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  సీఎం సన్నరకం ధాన్యం పండించాలని చెప్పారని వాటిని ఇప్పుడు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులు, ఫార్మాసిటీల పేరుతో దోపిడి. ఎస్ఎల్ బీసీ, బ్రహ్మాణవెల్లం ప్రాజెక్టుల పూర్తి చేయాలని ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు. ఎల్ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఈనెల 9న ఆందోళనలు చేపడుతామని చెప్పారు. 57 ఏళ్ల ఫెన్షన్, నిరుద్యోగ భృతి ఏమైందని దుయ్యబట్టారు. తండ్రికొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ధరణి.. తలాతోకలేని కార్యక్రమం అని దీంతో ఎలాంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ప్రజలు నష్టపోతున్నారని విమర్శించారు.

Updated Date - 2020-12-04T19:59:30+05:30 IST