Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్తజన సంద్రమైన మల్లన్న ఆలయం

చేర్యాల, డిసెంబరు 5 : కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి ఆలయం ఆదివారం భక ్తజన సంద్రమైంది. స్వామివారి దర్శనం కోసం జిల్లావాసులే కాకుండా  పొరుగు జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. సంప్రదాయబద్దంగా బెల్లం పాయసంతో బోనం నివేదించి పట్నాలు రచించి మొక్కులు తీర్చుకున్నారు. గంగిరేగుచెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను ఈడేర్చమని వేడుకున్నారు. మల్లన్నను దర్శించుకుని పట్టువస్త్రాలు, ఒడిబియ్యం, బండారి సమర్పించారు. గంగిరేగుచెట్టు ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. మల్లన్న సహోదరి ఎల్లమ్మతల్లిని దర్శించుకుని కల్లు, బెల్లం పానకం సాకపెట్టారు. బోనం నివేదించి, ఒడిబియ్యం పోసి పిల్లాపాపలను, పాడిపంటలను కాపాడమని వేడుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో బాలాజీశర్మ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, ధర్మకర్తలు ఉట్కూరి అమర్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌ తదితరులు, ఉద్యోగులు శ్రీనివాస్‌, జగదీశ్వర్‌, వెంకటాచారి, నర్సింహులు పర్యవేక్షించారు. 

Advertisement
Advertisement