Abn logo
Jul 13 2021 @ 08:50AM

దాతల ఔదార్యం స్ఫూర్తిదాయకం : కోన రఘుపతి

బాపట్ల: దేశ రక్షణలో ప్రాణాలు బలిదానం చేసిన మరుప్రోలు జస్వంత్‌రెడ్డి కుటుంబానికి భజరంగ్‌ ఫౌండేషన్‌వారు లక్ష రూపాయల ఆర్థికసాయం డిప్యూటీస్పీకర్‌ కోన రఘుపతి చేతులమీదగా సోమవారం అందజేశారు. గుంటూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ భజరంగ అర్బన్‌ ఇన్‌ఫ్రా డైరెక్టర్‌ అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జస్వంత్‌రెడ్డి కుటుంబసభ్యులను కలిసి సానుభూతి తెలియజేశారు. తమ వంతు సామాజిక బాధ్యతగా లక్ష రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ మానవతావాదుల ఔదార్యం అందరికి స్ఫూర్తి దాయకమన్నారు. దేశసేవలో ప్రాణాలు అర్పించిన జస్వంత్‌రెడ్డి కుటుంబానికి అందరూ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.