మా జీవితకథ ఎంతో భిన్నమైనది..: కొండా సురేఖ

ABN , First Publish Date - 2021-10-13T05:09:04+05:30 IST

మా జీవితకథ ఎంతో భిన్నమైనది..: కొండా సురేఖ

మా జీవితకథ ఎంతో భిన్నమైనది..: కొండా సురేఖ
కార్యక్రమంలో మాట్లాడుతున్న కొండా సురేఖ

గీసుగొండ, అక్టోబరు 12 : తమ జీవిత కథ ఎంతో భిన్నమైనదని, అందుకే రాం గోపాల్‌వర్మ సినిమా తీయడానికి  ముందుకువచ్చారని  కాంగ్రెస్‌ నేత, మాజీ మం త్రి కొండా సురేఖస్పష్టంచేశారు. కొండా మురళి-సురేఖల నిజ జీవిత ఘటనల ఆధా రంగా రాంగోపాల్‌ వర్మ రూపొందిస్తున్న ‘కొండా’ సినిమా షూటింగ్‌ను వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలంలోని వంచనగిరిలో మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండా మురళీధర్‌రావు-తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ఆయనను పెళ్లి చేసుకుంటే జీవితం పూలబాట అవుతుందని ఆశిం చానని, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ముళ్లబాటగా మారిందని సురేఖ తెలిపారు. 

తమ ప్రత్యర్థుల కుట్ర రాజకీయాలతో 20ఏళ్ల క్రితం ఏడేళ్ల  కుమార్తెతో తాను ఇంట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమని బతికానని గుర్తు చేసుకున్నారు. తాము ఎన్నో దానధర్మాలు చేయటమే కాకుండా పాఠశాలల నిర్మాణానికి కోట్ల విలువచేసే భూములను విరాళంగా ఇచ్చామన్నారు. కానీ నేడు కొందరు రాజకీయ నాయకులు మాత్రం ప్రజల భూములను లాక్కుంటున్నారని ఆవేదన చెందారు. తమ జీవిత కథకు ఎంతో చరిత్ర ఉన్నందునే రాంగోపాల్‌వర్మ సినిమా తీయడానికి  ముందుకు వచ్చారని సురేఖ స్పష్టం చేశారు.  సినిమాలో ఎలా చూపించినా మీ ఇష్టం అంటూ మురళీధర్‌రావు చేయిని ఆర్జీవీ చేతికి అందించారు. మురళీధర్‌రావు మాట్లాడుతూ ప్రజల, దేవతల దీవెనలు మాకు ఎప్పుడు ఉంటాయన్నారు.

దమ్మున్న మగాడు.. 

మహా దమ్మున్న మగాడు కొండా మురళీధర్‌రావు అని దర్శకుడు రాంగోపాల్‌వ ర్మ అన్నారు. సురేఖ వెంట మురళీధర్‌రావు పడ్డట్లు నేను వారి బయోపిక్‌ తీయటానికి చాలా తిరగాల్సి వచ్చిందని చెప్పారు. బయోపిక్‌ కొండా మురళికి పాజిటివ్‌గా ఉంటుందా, నెగిటీవ్‌గా ఉంటుందా అని చాలామంది తనను అడిగారన్నారు. సినిమాలో నిజాన్ని మీ ముందు ఉంచుతా మీరే పాజిటీవో, నెగెటివో చెప్పాలని అన్నట్లు వివరించారు. ఈ సినిమా శివ సినిమాను దాటిపోతుందని, తన సినిమా జీవితం లో ఈ బయోపిక్‌ చరిత్రను సృష్టిస్తుందన్నారు. కాగా, సినిమా షూటింగ్‌ ప్రారంభా నికి ముందు సాయిబాబా ఆలయం నుంచి ర్యాలీగా గ్రామానికి వచ్చారు. కార్యక్రమంలో నిర్మాత మల్లారెడ్డి, కాంగ్రెస్‌ మండలఅధ్యక్షుడు రడం భరత్‌కుమార్‌, నల్గొం డ రమేష్‌, సాయిని ప్రభాకర్‌, బొల్లం శివ, సారంగం తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-10-13T05:09:04+05:30 IST