Abn logo
Sep 28 2021 @ 00:40AM

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

నివాళి తెలుపుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్రం కోసం శ్రమించిన కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోమవారం అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి తెలిపారు. పద్మశాలి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు జయంతిని నిర్వ హించాయి. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనంలో వెనక బడిన తరుగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన వేడుకల్లో  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఆర్డీవో శ్రీని వాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, జిల్లా కన్వీనర్‌ తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీసీ సెల్‌ అధ్యక్షుడు బొల్లి రామ్మో హన్‌, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ దార్నం లక్ష్మీ నారాయణ, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, బీసీ సంక్షేమాధికారి మోహన్‌రెడ్డి కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ  సేవలు చిరసర్మణీయమని వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు.  సిరిసిల్ల గాంధీచౌక్‌ వద్ద సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి తెలిపారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మండల సత్యం, కౌన్సిలర్లు పత్తిపాక పద్మ, శ్రీనివాస్‌, మహిళా సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, మోర రవి తదితరులు పాల్గొన్నారు.