Abn logo
Sep 20 2021 @ 14:01PM

బండి సంజయ్, ప్రవీణ్‌లకు కొండా విశ్వేశ్వరరెడ్డి సవాల్

హైదరాబాద్: వైట్ ఛాలెంజ్ అనేది సమాజానికి మంచిదని కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ఛాలెంజ్ స్వీకరించి వస్తే కేటీఆర్ స్థాయి మరింత పెరిగేదని తెలిపారు. మా స్థాయి వేరు అని రాజకీయ నేతలు మాట్లాడొద్దని అన్నారు. పెద్ద రాజకీయ నేతలు - చిన్న వ్యక్తుల దగ్గరకు వెళ్లి మాట్లాడుతారన్నారు. సింగరేణి ఘటన డ్రగ్స్ వల్లనే అయిందని తెలిపారు. ఎన్నికల్లో నిలబడే ప్రతి లీడర్‌కు డ్రగ్ టెస్ట్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్ టెస్ట్ తీసుకున్న తరువాతే ఎన్నికల్లో నిలబడే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించాలన్నారు. రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ తొందర పాటులో మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ ఇష్యూకు రాహుల్‌కు సంబంధం లేదని - డ్రగ్ ఇష్యూ రాష్ట్రానికి చెందిన సమస్య అని అన్నారు. వైట్ ఛాలెంజ్ స్వీకరించి యువతకు ఆదర్శంగా నిలవాలని... బండి సంజయ్ - ప్రవీణ్ కుమార్‌కు  కొండా విశ్వేశ్వరరెడ్డి సవాల్ విసిరారు.


ఇవి కూడా చదవండిImage Caption