ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: రాష్ట్ర ఎమ్మార్పీఎస్‌ ఉపాధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-09-24T17:42:22+05:30 IST

పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా నీళ్లు నింపి వారిని..

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: రాష్ట్ర ఎమ్మార్పీఎస్‌ ఉపాధ్యక్షుడు

21వ రోజుకు చేరిన నిర్వాసితుల ఆందోళన


కొండాపురం(కడప): పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా నీళ్లు నింపి వారిని ఖాళీ చేయించడంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నయ్య మాదిగ తెలిపారు. తాళ్లప్రొద్దుటూరులో 21వ రోజు బుధవారం ఆందోళన చేస్తున్న నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరి ఎస్సీ కాలనీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చుట్టూ నీరు చేరడం వల్ల పాములు, విషపురుగులతో వారి ప్రాణానికి హానికలిగే అవకాశం ఉందని  ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వెంటనే వారికి పరిహారం చెల్లించి పునరావాసం కల్పించి గడువు ఇచ్చిన తర్వాతే నీళ్లు నింపాలన్నారు. మాజీ సర్పంచు నరసింహారెడ్డి, ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకుడు రాజశేఖర్‌, పెద్ద ఎత్తున నిర్వాసితులు పాల్గొన్నారు. 


14.1టీఎంసీలకు చేరిన గండికోట నీటిమట్టం

బుధవారం సాయంత్రానికి గండికోట ప్రాజెక్టులో 14.1టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో మైలవరం జలాశయానికి 7,400వేల క్యూసెక్కులు, పైడిపాళెంకు 990క్యూసెక్కులు, సీబీఆర్‌కు 550 క్యూసెక్కులు, జీఎన్‌ఎ్‌సఎ్‌స మెయిన్‌ కెనాల్‌ ద్వారా వామికొండ, సర్వరాయసాగర్‌లకు 400క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అవుకు రిజర్వాయర్‌ ద్వారా గండికోటకు వచ్చే నీరు 6,200 క్యూసెక్కులు ఉండగా, వర్షపునీరు మరో 4,500 క్యూసెక్కులు చేరుతోందని జీఎన్‌ఎ్‌సఎ్‌స ఈఈ రామాంజనేయులు తెలిపారు. 

Updated Date - 2020-09-24T17:42:22+05:30 IST