కేడీసీసీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-10-30T11:06:13+05:30 IST

కేడీసీసీ బ్యాంకు సేవలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని కరీంనగర్‌ డీసీసీబీ చైర్మన్‌, టీఎస్‌సీఏబీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నా రు.

కేడీసీసీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

కరీంనగర్‌ డీసీసీబీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌ రావు


మెట్‌పల్లి, అక్టోబరు 29: కేడీసీసీ బ్యాంకు సేవలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని కరీంనగర్‌ డీసీసీబీ చైర్మన్‌, టీఎస్‌సీఏబీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నా రు. గురువారం పట్టణంలోని కొత్త బస్టాండు సమీపంలో గల కేడీసీసీ బ్యాంకును వారు సందర్శించారు. ఉద్యోగులు, సింగిల్‌ విండో చైర్మన్లు వా రికి ఘన స్వాగతం పలికారు. బ్యాంకులో ఇటీవల నూతనంగా నిర్మిం చిన లాకర్లను పరిశీలించారు. పట్టణానికి చెందిన శీర్నంచ కల్యాణికి రూ. 10 లక్షలు, పోతు హరినాథ్‌కు రూ. 25 లక్షలు, ముషిరాబాద్‌ ప్ర భకు రూ. 10 లక్షల గృహ నిర్మాణ రుణాలను పంపిణీ చేశారు. ఈ సం దర్బంగా వారు మాట్లాడారు. మెట్‌పల్లి కేడీసీసీ బ్యాంకు రూ. 41 కోట్ల డిపాజిట్లు, రూ. 66 కోట్ల రుణాలు, రూ. 107 కోట్ల టర్నోవర్‌తో నడవ డం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి, ఇబ్రహీంప ట్నం, మల్లాపూర్‌ మండలాలకు చెందిన సహకార సంఘాల చైర్మన్లు, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


రైతుల అభివృద్ధికే సహకార బ్యాంకు

మెట్‌పల్లి రూరల్‌ : రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్ర భుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని ఎమ్మెల్యే విద్యా సాగర్‌రావు, టీ స్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీంధర్‌రావు అన్నారు. గురు వారం మెట్‌పల్లి విశాల సహకార సంఘంలో ఇంటి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు మంజూరైన లబ్ధిదారులకు వారు చెక్కులను అందజే శారు. అనంతరం వేంపేట గ్రామ శివారులో సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ అల్లూరి మహేందర్‌రెడ్డికి చెందిన ఫంక్షన్‌ హాల్‌ను వారు ప్రా రంభించారు. సీఎం కేసీఆర్‌ రైతులకు ఆధునాతన పద్ధతుల ద్వారా వ్య వసాయం చేయడానికి సబ్సిడీ పనిముట్లను అందజేసి రైతులకు అండ గా నిలుస్తున్నారన్నారు.  


ఆయా కార్యక్రమాల్లో మెట్‌పల్లి విశాల సహకార సంఘ అధ్యక్షుడు తీగల లింగారెడ్డి, సహకార సంఘాల చైర్మన్లు నేరేళ్ల శంకర్‌, నవీన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, బ్యాంకు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


కోరుట్ల రూరల్‌ : కెడిసీసీ బ్యాంక్‌ చైర్మెన్‌, రాష్ట్ర స్కాబ్‌ చైర్మెన్‌ రవింద్ర రావును గురువారం మండల సింగిల్‌ విండో చైర్మెన్‌లు సన్మానించారు. ర వింద్రరావు కోరుట్ల నుంచికరీంనగర్‌కు వెలుతుండగా సింగిల్‌ విండో చైర్మన్‌లు కలిసి పూల మాలలు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విండో చైర్మెన్‌లు బండి భూమయ్య, జగన్‌మోహన్‌రావు, ఆదిరె డ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-30T11:06:13+05:30 IST