Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్యతో పనిచేసిన అనుభవాలు జీవిత పాఠాలు....

జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా): రాజకీయ కురువృద్ధుడు, సుదీర్ఘ అనుభవశాలి, పంచెకట్టుతో తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచిన రాజకీయ చాణక్యుడు, ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక నిపుణుడు, ముఖ్యమంత్రిగా... గవర్నర్‌గా పనిచేసి, తెలుగువారి ఖ్యాతిని చాటిన రోశయ్య మరణం తెలుగువారికి తీరని లోటని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నివాళులు అర్పించారు. రోశయ్యను నిండు సహృదయడిగా ప్రశంసిస్తూ ఆయనతో పనిచేసిన అనుభవాలు తమకు జీవిత పాఠాలని బాలరాజు పేర్కొన్నారు. ఆయన అనారోగ్యంతో మరణించడం తెలుగు రాష్ట్రాల కు తీరని లోటన్నారు. రాోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోస్ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారి మృతి పట్ల ఎమ్మెల్యే బాలరాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement