heavy rains: కొంకణ్ రైళ్ల రాకపోకల రద్దు

ABN , First Publish Date - 2021-07-22T18:14:07+05:30 IST

భారీవర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో గురువారం కొంకణ్ రైల్వే పలు రైళ్లను...

heavy rains: కొంకణ్ రైళ్ల రాకపోకల రద్దు

ముంబై (మహారాష్ట్ర): భారీవర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో గురువారం కొంకణ్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.రత్నగిరి ప్రాంతంలోని చిప్లూన్-కమాతే రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న వశిష్ఠి నదిలో వరదనీరు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది. వశిష్ఠి నది వంతెన వద్ద వరదనీటి ప్రవాహంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. వరదల వల్ల పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశామని  కొంకణ్ రైల్వే ట్వీట్ చేసింది.ముంబైలోని కింగ్ సర్కిల్ రైల్వే బ్రిడ్జిపై కంటెయినరు ట్రక్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. 


Updated Date - 2021-07-22T18:14:07+05:30 IST