Advertisement
Advertisement
Abn logo
Advertisement

పశ్చిమ బెంగాల్‌ వాసులను రక్షించిన అధికారులు

 కోట, నవంబరు 30: వ్యవసాయ పనుల కోసం పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చి న కూలీలు వరదలో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. వరినాట్లు వేసేందుకు కలకత్తా నుంచి పలు కుటుం బాలు వారం రోజుల క్రితం మండలంలోని ఊనుగుంట పాళెం వ చ్చాయి. వారిలో 14 మంది సోమవారం రుద్రవరం సమీపంలోని పొలాల్లో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. పనులు పూర్తయిన అనం తరం ఊనుగుంటపాళెం బయలుదేరిన వారు గ్రామ సమీపంలోని మామిడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడం గమనించి ఆందోళనకు గురయ్యారు. దీంతో సమీపంలోని రుద్రవరం గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడ స్వర్ణముఖి నది ప్రవహి స్తుండడంతో చేసేది లేక నది ఒడ్డునే ఉన్న మోటారు షెడ్‌లో రాత్రంతా తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు తాళ్ల సాయంతో రక్షించేందుకు చేసిన ప్రయత్నాలను వారు తిరస్కరించారు. చివరికి మంగళ వారం వీఆర్వో, వీఆర్‌ఏతోపాటు చేవూరు నాగయ్య, నాగేశ్వరరావు సాహసించి వారిని సురక్షి తంగా బయటకు తీసుకువచ్చారు. తహసీల్దారు రమాదేవి, సర్పంచ్‌ చెంగమ్మ పర్యవేక్షించారు.

Advertisement
Advertisement