సినీ నిర్మాత, టీడీపీ యువ నేత కొరిటాల సందీప్‌ హఠాన్మరణం

ABN , First Publish Date - 2021-03-01T05:47:03+05:30 IST

సినీనిర్మాత, తెలుగుదేశం పార్టీ నేత కొరిటాల సందీప్‌(36) ఆదివారం తెల్లవారుజామున బాపట్లలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

సినీ నిర్మాత, టీడీపీ యువ నేత కొరిటాల సందీప్‌ హఠాన్మరణం
కొరిటాల సందీప్‌ (ఫైల్‌ఫొటో)

 బాపట్ల,ఫిబ్రవరి 28:  సినీనిర్మాత, తెలుగుదేశం పార్టీ నేత కొరిటాల సందీప్‌(36) ఆదివారం తెల్లవారుజామున బాపట్లలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన బాపట్లమండలం పూండ్ల గ్రామానికి తీసుకెళ్ళారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పూండ్ల గ్రామానికి చేరుకొని భౌతికకాయంపై పుష్పాంజలి ఘటించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ, మాజీ ఎంపీపీ మానం విజేత, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్దనరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తాతా జయప్రకాష్‌ నారాయణ, మాజీ సర్పంచ్‌లు వీరమల్లు వీరయ్యచౌదరి, ఇనగంటి గాంధీ, ముక్కామల సాంబశివరావు తదితరులు పుష్పాంజలి ఘటించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం క్రియాశీలకంగా వ్యవహరించే సందీప్‌ను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు,  లోకేష్‌లు గతంలో అనేక పర్యాయాలు అభినందించారు. 


Updated Date - 2021-03-01T05:47:03+05:30 IST