కరోనా కట్టడికి సహకరించాలి

ABN , First Publish Date - 2021-05-06T06:13:37+05:30 IST

జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్‌ కట్టడికి ప్రజానీకం సహకరించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కోరారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత నేపథ్యంలో వైద్యపరంగా కూడా అనేకచర్యలు తీసుకున్నా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో కొన్నిప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే షాపులు మూసివేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు.

కరోనా కట్టడికి సహకరించాలి
కలెక్టర్‌ పోలా భాస్కర్‌

అందుబాటులో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం

పరిశ్రమలు నిబంధనలు పాటించాల్సిందే

కలెక్టర్‌ పోలా భాస్కర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 5: జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్‌ కట్టడికి ప్రజానీకం సహకరించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కోరారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత నేపథ్యంలో వైద్యపరంగా కూడా అనేకచర్యలు తీసుకున్నా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో కొన్నిప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే షాపులు మూసివేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. అయినా ఉధృతి తగ్గకపోవటంతో ప్రభుత్వం కర్ఫ్యూను ప్రకటించిందన్నారు. జిల్లాలో ఈ కర్ఫ్యూ అమలుకు జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. గ్రామ సచివాలయం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పరిశ్రమలు, వివిధ సంస్థల్లో కొవిడ్‌ నిబంధనలు అనుసరించి పనిచేసే విధంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు పూర్తిగా మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే వివిధ పనుల కోసం వెళ్లేవారు ఆధారాలు చూపితే వారికి మినహాయింపు ఇస్తామని కలెక్టర్‌ స్పష్టంచేశారు. వైద్యశాలల్లో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, జేసీలు వెంకటమురళీ, టీఎస్‌ చేతన్‌, ఏఎస్పీ రవిచంద్ర ఉన్నారు. 


Updated Date - 2021-05-06T06:13:37+05:30 IST