కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి

ABN , First Publish Date - 2021-04-17T05:59:07+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీనియన్‌ ఐఏఎస్‌ అధికారి, కొవిడ్‌ జిల్లా ప్రత్యేక అధికారి ఆర్‌పీ సిసోడియా ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణకు జిల్లాకు ప్రత్యేక అధికారిగా సిసోడియాను నియమించడంతో ఆయన శుక్రవారం జిల్లాకు వచ్చారు. స్థానిక ఎన్‌ఎ్‌సపీ అతిఽథిగృహానికి వచ్చిన ఆయనను కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జేసీ వెంకటమురళీ, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సిసోడియా

- బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

- కోవిడ్‌ జిల్లా ప్రత్యేకాధికారి సిసోడియా

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 16: జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీనియన్‌ ఐఏఎస్‌ అధికారి, కొవిడ్‌ జిల్లా ప్రత్యేక అధికారి ఆర్‌పీ సిసోడియా ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణకు జిల్లాకు ప్రత్యేక అధికారిగా సిసోడియాను నియమించడంతో ఆయన శుక్రవారం జిల్లాకు వచ్చారు. స్థానిక ఎన్‌ఎ్‌సపీ అతిఽథిగృహానికి వచ్చిన ఆయనను కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జేసీ వెంకటమురళీ, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో కరోనా పరిస్థితిపై ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సిసోడియా మాట్లాడారు. జిల్లా అధికారులు, ప్రభుత్వానికి వారధిగా ఉండి జిల్లాలో కరోనా నియంత్రణకు కృషిచేస్తానని తెలిపారు. కలెక్టర్‌ భాస్కర్‌ ప్రత్యేక దృష్టి పెట్టి మూడు నాలుగు మండలాలను ఒక క్లస్టర్ల ఏర్పాటుచేసి 18మంది సీనియర్‌ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించడం అభినందనీయమన్నారు. జేసీ చేతన్‌ నేతృత్వంలో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీని కూడా నియమించారన్నారు. కరోనా బాధితులు వైద్యశాలల్లో చేరాల్సిన పరిస్థితి వస్తే మూడు గంటల్లోనే బెడ్‌ ఏర్పాటు చేసేలా సిద్ధంగా ఉంచారని తెలిపారు.  జిల్లాలో 65వేల కోవిడ్‌ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 2288 యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. బస్టాండు వంటి రద్దీ ప్రదే శాల్లో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధంగా ఉంచామన్నారు. గతేడాది 1300 పడకలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 1,800 పడకలను సిద్ధం చేసినట్లు తెలిపారు. గతంలో మాదిరిగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎస్పీ సిద్దార్ద కౌశల్‌, జేసీలు వెంకటమురళీ, టీఎ్‌సచేతన్‌, డీఆర్వో కే.వినాయకం, జడ్పీ సీఈఓ కైలాష్‌ గిరీశ్వర్‌, ఓఎ్‌సడీ చౌడేశ్వరి పాల్గొన్నారు. అనంతరం రిమ్స్‌, అద్దంకిలో సిసోడియా పర్యటించారు. 

Updated Date - 2021-04-17T05:59:07+05:30 IST