బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్‌ను వరించిన యువజన పురస్కార్ అవార్డు!

ABN , First Publish Date - 2021-01-17T20:34:25+05:30 IST

ఎన్నారై టీఆర్ఎస్‌ సెల్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన వారికి ఎన్నారై టీఆర్ఎ

బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్‌ను వరించిన యువజన పురస్కార్ అవార్డు!

హైదరాబాద్: ఎన్నారై టీఆర్ఎస్‌ సెల్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన వారికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆపన్న హస్తం అందిస్తోందని కొనియాడారు. బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ చేస్తున్న సేవా కార్యక్రమాలను యువజన సంఘాల సమితి అభినందించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్‌ను కొనియాడింది. శనివారం రోజు కోరుట్లలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అభినందన సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ తరఫున ప్రధాన కార్యదర్శి మగ్గడి రాజేందర్ పాల్గొన్నగా.. ఆయనకు యువజన సంఘాల సమితి సభ్యులు రాష్ట్ర యువజన పురస్కార్-2021 అవార్డును అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మగ్గిడి రాజేందర్‌కు శాలువాకప్పి.. పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. 



కాగా.. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి, ఎన్‌ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ బృందంతో కలిసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. విదేశాల్లో చనిపోయిన వారి మృతదేహాలను  స్వదేశం తీసుకొచ్చేందుకు సాయం చేస్తున్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమకు యువజన పురస్కార్-2021 అవార్డు రావడం సంతోషంగా ఉందని ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను కొనసాగించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దావ వసంత, కల్వకుంట సంజయ్ కుమార్, ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ రవి, కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్యతో పాటు.. మగ్గిడి నరేందర్, హరిశ్, ఆకు రాజ్ కుమార్, మ్యాకల రాజలింగం, గోరుమంతుల నరేశ్, గన్యారపు భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T20:34:25+05:30 IST