యూట్యూబ్‌లో చూసి, 45 నిముషాల‌కొక‌ పీపీఈ కిట్‌...

ABN , First Publish Date - 2020-06-04T14:39:44+05:30 IST

రాజ‌స్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన స్వయం సహాయక బృందంలోని మహిళలు యూట్యూబ్‌లో చూసి, పీపీఈ కిట్లు త‌యారుచేయ‌డం నేర్చుకున్నారు. రూ 450 నుంచి 600 రూపాయల మ‌ధ్య‌...

యూట్యూబ్‌లో చూసి, 45 నిముషాల‌కొక‌ పీపీఈ కిట్‌...

కోటా: రాజ‌స్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన స్వయం సహాయక బృందంలోని మహిళలు యూట్యూబ్‌లో చూసి, పీపీఈ కిట్లు త‌యారుచేయ‌డం నేర్చుకున్నారు. రూ 450 నుంచి 600 రూపాయల మ‌ధ్య‌ మార్కెట్‌లో దొరికే ఈ కిట్‌లను కోటా మహిళలు 320 రూపాయలకే అందిస్తున్నారు. ఇంతేకాకుండా వీరు డాక్టర్ల గౌన్లు, కోట్లు, నర్సుల‌ గౌన్లు, ఫుల్ మాస్క్ క్యాప్స్ కూడా రూపొందిస్తున్నారు. కోటా కార్పొరేషన్ కమిషనర్ వాసుదేవ్ మాలావత్ మాట్లాడుతూ పీపీఈ కిట్లను స్వయం సహాయక బృందాల మహిళలు తయారు చేశారు. ఫేస్ మాస్క్‌లను తయారు చేయడంలో రాజ‌స్థాన్‌లోని కోటా జిల్లా అగ్ర‌స్థానంలో ఉంద‌న్నారు. డాక్టర్ హేమలతా గాంధీ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ స‌ల‌హాల‌కు అనుగుణంగా ఈ కిట్లు త‌యారు చేశారు. ఇందుకోసం 90 జీఎస్ఎం ఫాబ్రిక్ ఉప‌యోగించారు. ఒక్కో పీపీఈ కిట్ కేవలం 45 నిమిషాల్లో సిద్ధం చేస్తున్నార‌న్నారు. 

Updated Date - 2020-06-04T14:39:44+05:30 IST