కోటక్ మహీంద్రా... అదుర్స్., ఇంకా ఉంది : ఉదయ్

ABN , First Publish Date - 2021-07-30T03:52:53+05:30 IST

ప్రైవేటు బ్యాంక్ కోటక్ మహీంద్రా 2021-22 తొలి త్రైమాసికం ఫలితాలు వెల్లడించింది.

కోటక్ మహీంద్రా... అదుర్స్., ఇంకా ఉంది : ఉదయ్

ముంబై : ప్రైవేటు బ్యాంక్ కోటక్ మహీంద్రా 2021-22 తొలి త్రైమాసికం ఫలితాలు వెల్లడించింది. సమీక్షా కాలానికి సంస్థ రూ. 1,641.92 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది  ఇదే సమయానికి కంపెనీ లాభం రూ. 1,244.45 కోట్లు. అంటే గత సంవత్సరం కంటే ఇప్పుడు 32శాతం పెరిగింది. రేటింగ్ ఏజెన్సీల అంచనాలను మించి మరీ సంస్థ లాభాలను గడించడం గమనార్హం.  కంపెనీ నెట్ ఇంట్రెస్ట్ ఆదాయం 6 శాతం పెరిగి రూ. 3,942 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇది రూ. 3,724 కోట్లు. ఇక... కోటక్ మహీంద్రా బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏలు 3.56 శాతంగా ఉన్నాయి. 


కాగా... మరింత బోల్డ్ గా, ఇంకాస్త ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమటున్నారు సంస్థ సీఈఓ అండ్ ఎండీ ఉదయ్ కోటక్.  అన్ సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో ఇంకా ముందుకే వెళతామంటున్నారు. ఈ ఏడాది తమ ఫోకస్, వ్యూహం మారాయని, రిటైల్, కమర్షియల్ లెండింగ్ లో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

Updated Date - 2021-07-30T03:52:53+05:30 IST