Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోటప్పకొండలో భక్తుల రద్దీ

త్రికోటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు

కోటప్పకొండ(నరసరావుపేట), నవంబరు 29:  కార్తీక మాసం నాలుగో సోమవారాన్ని  పురస్కరించుకుని త్రికోటేశ్వరస్వామి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా కొండకు తరలి వచ్చి కోటయ్య స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. స్వామికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపారాధనలు చేశారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు.  

త్రికోటేశ్వరుని సన్నిధిలో తమ్మినేని దంపతులు 

ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని శాసన సభాపతి తమ్మినేని సీతారాం దంపతులు సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి చరిత్ర, ఆలయ విశేషాలు, ఫిబ్రవరిలో జరగనున్న తిరునాళ్ళ మహోత్సవం, పరిసర ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తమ్మినేనికి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరావు వివరించారు. కార్యక్రమంలో ఈవో అన్నపురెడ్డి రామకోటేశ్వరరావు, ఆర్డీవో శేషిరెడ్డి, తహసీల్దారు ఆర్వీ రమణనాయక్‌, మిట్టపల్లి రమేష్‌బాబు, మోరబోయిన శ్రీనివాసరావు, మోరె రవీంద్రరెడ్డి, చిట్టిబాబు, వంపుగుడి జాన్‌, కనక పుల్లారెడి,్డ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement