Abn logo
Sep 23 2020 @ 16:44PM

సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర రావుకు అరుదైన గౌరవం

Kaakateeya

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గౌరవ అంబాసడర్‌గా ఆయన నియమితులయ్యారు. దక్షిణ భారత దేశం నుంచి కోటేశ్వరరావును ఎంపిక చేసినట్లు ఆ సంస్థ తరుపున రవీంద్ర కుమార్ న్యూఢిల్లీలో ప్రకటించారు. కోటేశ్వరరావు మీడియా రంగంలోనే కాకుండా, పలు సామాజిక కార్యక్రమాలను చేస్తున్నందుకు గత సంవత్సరం గ్లోబల్ పీస్ ఫౌండేషన్ వారు గౌరవ డాక్టరేట్‌ను  ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఈ గౌరవాన్ని కల్పించినందుకు సంస్థకు, సహాయ సహకారాలు అందించిన మీడియాకు, మిత్రులకు కోటేశ్వరరావు ధన్య వాదాలు తెలియజేసారు.

Advertisement
Advertisement
Advertisement