Abn logo
Nov 22 2020 @ 17:17PM

శరవేగంగా రెడీ అవుతోన్న ‘కోతి కొమ్మచ్చి’

Kaakateeya

దివంగత నటుడు శ్రీహరి తనయుడు, దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు హీరోలుగా వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'కోతికొమ్మచ్చి'. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతుంది. ఇటీవలే అమలాపురంలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్, సాంగ్స్ షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం వైజాగ్‌లో హీరోలు మేఘాంశ్ , సమీర్.. హీరోయిన్స్ రిద్ది కుమార్, మేఘా చౌదరిలపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో ఒక సాంగ్ మినహా టోటల్ షూట్ పూర్తి చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర దర్శకుడు చెప్పి ఉన్నారు. అందుకే ఎలాంటి బ్రేక్ లేకుండా శరవేగంగా షూట్ చేస్తున్నారు. అమలాపురంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ బాగా ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తామని చిత్రయూనిట్‌ తెలుపుతోంది.

Advertisement
Advertisement