Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీలో ఇరవై కుటుంబాలు చేరిక

 మొగల్తూరు, నవంబరు 29 : వైసీపీ విధానాలకు విసుగుచెంది కొత్తోట మాజీ సర్పంచ్‌ రేవు పద్మారావు ఆధ్వర్యంలో సోమవారం ఇరవై కుటుంబాలు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం పాతపాడులో టీడీపీ సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలు, ఆర్థిక దోపిడీలను గ్రామస్థులకు వివరించారు. టీడీపీ నాయకులు రాయుడు శ్రీరాములు, జోగి పండు, పార్టీ మండల అధ్యక్షుడు గుబ్బల నాగరా జు, మాజీ ఎంపీపీ కత్తిమండ ముత్యాలరావు, ఎస్సీసెల్‌ నాయకులు డొల్లా రత్నంరాజు, కొల్లాటి బోగరాజు, పాలా గోపాలం, పితాని రమేష్‌, బొక్కా తరుణ్‌, బాలాజీ, బందన నర్సింహస్వామి, కొల్లాటి బాలకృష్ణ, కొల్లాటి మూలాస్వామి, వాటాల శ్రీను, వైధాని ధర్మారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement