ఈటల బీసీ కాదు.. రెడ్డి: కౌశిక్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-05-08T18:30:26+05:30 IST

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీసీ కాదని..

ఈటల బీసీ కాదు.. రెడ్డి: కౌశిక్‌రెడ్డి

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీసీ కాదని.. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి అని పేర్కొన్నారు. కొడుకు పేరు మీద ఉన్న వందల కోట్ల భూ రికార్డుల్లో ఈటల రెడ్డిగా ఉందని... నితిన్ రెడ్డి తండ్రి రాజేందర్ రెడ్డి అని ఉందని కౌశిక్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌కు వందల కోట్ల డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. గుడ్లు పెట్టని కొండలకు కోట్లు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో రాజీనామా ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. ఈటల భయపడి పారిపోయారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-05-08T18:30:26+05:30 IST