కొవిడ్‌-19 మరణాలకు ఆస్కారమివ్వొద్దు

ABN , First Publish Date - 2020-05-25T09:17:54+05:30 IST

జిల్లాలో కొవిడ్‌-19 మరణాలకు ఆస్కారమివ్వొద్దని రాష్ట్ర ప్రజారోగ్య సలహాదారుడు డాక్టర్‌

కొవిడ్‌-19 మరణాలకు ఆస్కారమివ్వొద్దు

రాష్ట్ర ప్రజారోగ్య సలహాదారుడు డాక్టర్‌ కమల్‌రాజ్‌


అనంతపురం, మే 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొవిడ్‌-19 మరణాలకు ఆస్కారమివ్వొద్దని రాష్ట్ర ప్రజారోగ్య సలహాదారుడు డాక్టర్‌ కమల్‌రాజ్‌ అధికారులకు సూచిం చారు. ఆదివారం ఆయన కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడుతో కలిసి కొవిడ్‌-19 నోడల్‌ అధికారులతో సమావేశమయ్యారు. కొవిడ్‌-19 వ్యాప్తి, ని యంత్రణ చర్యలపై సమీక్షించారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనంతరం డాక్టర్‌ కమల్‌రాజ్‌ మా ట్లాడుతూ తాను డబ్ల్యూహెచ్‌ఓలో పనిచేయడంతో పాటు 27 ఏళ్లపాటు వివిధ దేశాల్లో విధులు నిర్వర్తించానన్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో జిల్లాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చానన్నారు.


జిల్లా యంత్రాంగానికి తనవంతు సహకారం అందించడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశ్య మన్నారు. జిల్లాలో కంటైన్మెంట్‌ జోన్‌లలో ఎక్కువ సంఖ్య లో కరోనా టెస్టులు చేయడం అభినందనీయమన్నారు. కొ విడ్‌-19 మరణాలను నివారించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్య మన్నారు. ఆ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు వలస కూలీల రాక ఎక్కువగా ఉన్నందున కరోనాను సవాలుగా తీసుకుని ఆ మేరకు ని యంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.


కంటైన్మెంట్‌ జోన్‌ లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆ ప్రాంతాల్లో ఎక్కువ టెస్టులు నిర్వహించాలన్నారు.  తన మూడ్రోజుల పర్యటనలో భాగంగా క్వారంటైన్‌ కేంద్రాలు, కంటైన్మెంట్‌ జోన్‌లు, కొవిడ్‌ ఆస్పత్రులు పరిశీలిస్తామన్నారు.  కార్యక్ర మంలో రెవెన్యూ, రైతు భరోసా జేసీ నిశాంత్‌కుమార్‌, సచివాలయ జేసీ డాక్టర్‌. సిరి, జేసీ-2 రామ్మూర్తి, సబ్‌ కలెక్టర్‌ నిషాంతి, డీఎఫ్‌ఓ జగన్నాథ్‌సింగ్‌, డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ పద్మావతి, నోడల్‌ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-05-25T09:17:54+05:30 IST