సూర్యాపేట జిల్లాలో కొవిడ్‌ ప్రమాద ఘంటికలు

ABN , First Publish Date - 2021-04-09T06:41:54+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గురువారం 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3107 కరోనా పరీక్షలు నిర్వహించగా 62 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. జిల్లాలో ఇప్పటివరకు 18378 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇందులో 17910 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం యాక్టివ్‌ కేసులు 434 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 34 మంది మృతి చెందారు.

సూర్యాపేట జిల్లాలో కొవిడ్‌ ప్రమాద ఘంటికలు
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటున్న ఎంపీపీ స్నేహలత

ఒకే రోజు 62 కరోనా కేసులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

 జిల్లాలో కొవిడ్‌ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గురువారం 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3107 కరోనా పరీక్షలు నిర్వహించగా 62 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. జిల్లాలో ఇప్పటివరకు 18378 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇందులో 17910 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం యాక్టివ్‌ కేసులు 434 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 34 మంది మృతి చెందారు. 

పెరుగుతున్న కొవిడ్‌ బాధితులు

 నేరేడుచర్ల, పాలకవీడు మండలాలలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు ఒకటి, రెండు కేసులు నమోదవుతున్నాయి. 15 రోజులుగా పెంచికల్‌దిన్న, నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఒకే రోజు తొమ్మిది కేసులు,  రెండు రోజుల క్రితం నాలుగు కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టు చేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడంలేదని  నేరేడుచర్ల వైద్యాధికారి డాక్టర్‌ నాగయ్య తెలిపారు. 

ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలి

ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రి ఇన్‌చార్జి కరుణ్‌కుమార్‌ కోరారు. పట్టణంలోని ఆసుపత్రిలో ఏర్పా టుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో డాక్టర్లు దశరథ, రవికుమార్‌, వనజ పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారంలో 51 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్‌ వచ్చినట్లు హెల్త్‌ అసిస్టెంట్‌ ఇందిరాల రామకృష్ణ తెలిపారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మఠంపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో  తహసీల్దార్‌ లక్ష్మణ్‌ బాబు, ఎస్‌ఐ విష్ణు, మండల వైద్యాధికారి డాక్టర్‌ ఫీరోజ్‌ పాల్గొన్నారు.  సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ టీకాను జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌ తీసుకున్నారు. కార్యక్రమంలో  ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దండ మురళీధర్‌రెడ్డి, సూర్య ప్రకాష్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నడిగూడెంలో టీకా కార్యక్రమాన్ని  అసంక్రమిత వ్యాధుల పొగ్రాం జిల్లా అధికారి కల్యాణ్‌ చక్రవర్తి పరిశీలిం చారు.  కార్యక్రమంలో  డాక్టర్లు లక్ష్మీప్రసన్న, సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. నూతన్‌కల్‌ మండలం ఎర్రపహాడ్‌ గ్రామంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను మండల వైద్యాధికారి త్రివేణి పర్యవేక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుర్రం సత్యనారాయణ గౌడ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.  తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షను ఎంపీపీ స్నేహలత చేయించుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శాతవాహనరావు, ఆరోగ్య సిబ్బంది మాధవి, నరసింహారావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మాస్క్‌లు లేని ఏడుగురికి జరిమానా

మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిపై మునిసిపల్‌ అధికారులు జరి మానా విధిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిపై జిల్లాలో ప్రతి రోజు  60 నుంచి 70 కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్క సూర్యాపేట పట్టణంలోనే 20 నుంచి 30 కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే పట్టణంలో మున్సిపల్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి మాస్కు లు లేని ఏడుగురు వ్యక్తులకు  ఒకొక్కరికి రూ. 500 చొప్పున రూ. 3500 జరిమానా విధించారు. కేసారంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 

ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి

కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి.  ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. మాస్కు ధరించని వారిపై రూ. 500నుంచి రూ.1000 వరకు జరిమానాతో పాటు క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తాం.

- రామాంజులరెడ్డి, మునిపిపల్‌ కమిషనర్‌ 


Updated Date - 2021-04-09T06:41:54+05:30 IST