మీడియాకు కొవిడ్‌ కాటు

ABN , First Publish Date - 2020-10-01T06:32:20+05:30 IST

దేశీయ మీడియా, వినోద రంగాల్ని కరోనా కోలుకోలేనంద దెబ్బ తీసింది...

మీడియాకు కొవిడ్‌ కాటు

న్యూఢిల్లీ:  దేశీయ మీడియా, వినోద రంగాల్ని కరోనా కోలుకోలేనంద దెబ్బ తీసింది. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరం రూ.1,75,100 కోట్లున్న ఈ రంగం ఆదాయం ఈ ఆర్థిక సంవత్స,రం (2020-21) 20 శాతం తగ్గి రూ.1,40,200 కోట్లకు పడిపోనున్నట్టు  అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఒక నివేదికలో తెలిపింది. అయితే వచ్చేఆర్థిక సంవత్సరం (2021-22)  ఈ రంగం కోలుకుని 33 శాతం వృద్ధి రేటుతో రూ.1,86,600 కోట్ల ఆదాయం నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. డిజిటలీకరణ, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తాయని తెలిపింది. 


నివేదిక ఇతర ప్రధాన అంశాలు 

  1. 2028 నాటికి 100 కోట్లకు  డిజిటల్‌ మీడియా వినియోగదారులు.
  2. లాక్‌డౌన్‌తో వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు.
  3. కంటెంట్‌ నుంచి పంపిణీ వరకు పెరిగిన డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం.
  4. డిజిటల్‌ నైపుణ్యాలు అలవర్చుకోవడంలో తప్పని సవాళ్లు.
  5. డిజిటల్‌ టెక్నాలజీతో కలిసొస్తున్న ఖర్చులు, సమయం. 
  6. టీవీ మీడియాను మించనున్న డిజిటల్‌ మీడియా ప్రకటనలు, ప్రచార ఆదాయం.
  7. ఆదాయ పరంగా పుంజుకున్న ఓటీటీ యాప్‌లు.
  8. తగ్గుతున్న ప్రింట్‌, రేడియో, టీవీ మీడియాల ప్రభావం.

Updated Date - 2020-10-01T06:32:20+05:30 IST