కొవిడ్‌ కేర్‌, కౌన్సెలింగ్‌ సెంటర్‌ను పక్కాగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-05-18T05:33:29+05:30 IST

కొడ్‌ కేర్‌, కౌన్సెలింగ్‌ సెంటర్‌ను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అదికారులను ఆదేశించారు.

కొవిడ్‌ కేర్‌, కౌన్సెలింగ్‌ సెంటర్‌ను పక్కాగా నిర్వహించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు


కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం, మే17(ఆంధ్రజ్యోతి): కొడ్‌ కేర్‌, కౌన్సెలింగ్‌ సెంటర్‌ను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అదికారులను ఆదేశించారు. సోమవారం డీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌, కౌన్సెలింగ్‌ సెంటర్లను కలెక్టర్‌ పరిశీలించారు. కరోనా బాధితులు ఎంత మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు, రోజూ ఎంత మందికి ఇస్తున్నారు..? కాల్‌ చేసినపుడు ఎంతమంది ఫోన్‌ లిఫ్ట్‌చేసి వివరాలు తెలియజేశారు, మరుగుదొడ్లు, మెడికల్‌ కిట్ల సరఫరా తదితర వివరాలను నోడల్‌ ఆఫీసర్‌ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ కేర్‌, కౌన్సెలింగ్‌ సెంటర్ల నుంచి ఎప్పటికప్పుడు పాజిటివ్‌ వచ్చిన వారికి ఫోన్లు చేసి, కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. ఇతర నోడల్‌ అధికారులతో సమన్వయం చేసుకుని, ఏ రోజుకారోజు పాజిటివ్‌ వచ్చిన వారి జాబితాను తెప్పించుకొని త్వరితగతిన కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి డేటాను మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి 9 గంటలకు కొవిడ్‌ కేర్‌, కౌన్సెలింగ్‌ సెంటర్‌కు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కొవిడ్‌ కేర్‌, కౌన్సెలింగ్‌ సెంటర్‌ నోడల్‌ ఆఫీసర్‌ నరసింహారెడ్డి, ఏపీడీ నరసయ్య, డాక్టర్‌ సుస్మిత, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T05:33:29+05:30 IST