ఉల్లిభద్రలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2021-04-11T05:52:39+05:30 IST

ల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండో దశలో భాగంగా రోజుకు సగటున 50 కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పార్వతీపురం డివిజన్‌లో కరోనా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో ఇక్కడ క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. పార్వతీపురం డివిజన్‌ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతానగరం, పార్వతీపురం పట్టణం, తదితర ప్రాంతాల వారు కరోనా బారిన పడితే అక్కడికి తరలించి వైద్యసేవలు అందించనున్నారు.

ఉల్లిభద్రలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌
భవనాలను పరిశీలిస్తున్న అధికారులు




ఉద్యానవన కళాశాలలో ఏర్పాటుకు చర్యలు

పార్వతీపురం డివిజన్‌లో బాధితులకు సత్వర వైద్యసేవలు

(పార్వతీపురం)

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండో దశలో భాగంగా రోజుకు సగటున 50 కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పార్వతీపురం డివిజన్‌లో కరోనా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో ఇక్కడ క్వారంటైన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. పార్వతీపురం డివిజన్‌ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతానగరం, పార్వతీపురం పట్టణం, తదితర ప్రాంతాల వారు కరోనా బారిన పడితే  అక్కడికి తరలించి వైద్యసేవలు అందించనున్నారు. 


నిర్థారణ పరీక్షల్లో జాప్యం

వైరస్‌ నిర్థారణ పరీక్షల విషయంలో జాప్యం జరుగుతోంది. గతంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీల్లో నిర్థారణ పరీక్షలు చేసేవారు. ఫలితాలు వెనువెంటనే వచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం నెల్లిమర్లలోని వైద్య కళాశాలలో మాత్రమే నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. శాంపిళ్ల సేకరణకుగాను పార్వతీపురం డివిజన్‌లో రెండు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఆ వాహనాల ద్వారా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. నెల్లిమర్లలోని వైద్య కళాశాలకు పంపిస్తున్నారు. కానీ వైరస్‌ అనుమానితులు ఇళ్ల వద్ద ఉండడం లేదు. ఇష్టారాజ్యంగా తిరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీనిపై యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరముంది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుపై డిప్యూటీ డీఎంహెచ్‌వో రవికుమార్‌రెడ్డి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. 


ఏరియా ఆస్పత్రిలో అనుమానమే..

పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధికి గురైన వారికి ప్రత్యేకంగా ఒక వార్డును కేటాయించి వైద్య సేవలందించేవారు. ఇప్పుడు రెండో దశ కేసులు పెరుగుతున్న తరుణంలో ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తారా? లేదా అన్నదానిపై స్పష్టత లేదు. నిత్యం రోగులతో ఏరియా ఆస్పత్రి కిటకిటలాడుతూ కనిపిస్తుంది. రోజుకు సగటున 200 నుంచి 250 వరకూ ఓపీ ఉంటుంది. ఏజెన్సీ ముఖ ద్వారంగా ఉండడంతో గిరిజనులు ఎక్కువగా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కరోనా వార్డు ఏర్పాటుచేస్తే సాధారణ రోగులకు అసౌకర్యం కలిగే అవకాశముంది. దీంతో కరోనా వార్డు ఏర్పాటు విషయంలో అధికారులు ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. 





Updated Date - 2021-04-11T05:52:39+05:30 IST